మహిళల కోసం తొలిసారి ఆ పని చేసిన పవన్ కళ్యాణ్..!



సామజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లో స్పందిస్తారు.కానీ తొలిసారి పవన్ తన ట్విట్టర్ లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. వసూళ్లను అద్భుతంగా రాబడుతూ దేశం లోనే సంచలనం సృష్టిస్తున్న దంగల్ చిత్రం గురించి పవన్ ప్రస్తావించారు. అమిర్ ఖాన్ ఈ చిత్రంలో అద్భుత నటనని కనబరిచాడని, ఆ నటనతోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నారని పవన్ ప్రశంసించాడు.
ఈ చిత్రాన్ని చూసిన తరువాత తాను దంగల్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నానని పవన్ అన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీని ప్రత్యేకంగా అ పవన్ అభినందించాడు.ప్రేక్షకులు లీనమయ్యెలా ఈచిత్రాన్ని తెరకెక్కించారని పవన్ అన్నారు. మిగత నటీనటులను, సాంకేతిక బృందాన్ని కి కూడా పవన్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం మహిళల సాధికారత గురించి మనందరం ఆలోచించేలా చేసిందని పవన్ అన్నారు. కాగా తన ట్విట్టర్ లో ఎప్పుడూ పవన్ రాజకీయ, సామజిక సమస్యల గురించే ట్వీట్ లు చేస్తూంటారు. ఓ సినిమా గురించి ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రం లో మహిళల సాధికారత గురించి అద్భుతంగా చూపించడంతో చిత్ర బృందాన్ని అభిందించాలని పవన్ ఈ చిత్రం పై స్పందించాడు. పలు రాష్ట్రాల్లో దంగల్ చిత్రానికి వినోదపు పన్నుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. భేటీ బచావో.. భేటీ పదవో.. కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఈ చిత్రం ఉందని ఇలాంటి చిత్రాలకు ప్రోత్సాహాన్ని అందించాలని అందుకే వినోదపు పన్ను రద్దు చేశామని హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.





View image on Twitter