గుంటూరోడు Teaser Review



మనోజ్ మంచు ఇప్పుడు ‘గుంటూరోడు’ గా అల‌రించ‌డానికి రెడీ అయ్యాడు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌త్య ద‌ర్శకుడు. ‘భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా’ అంటూ  మోషన్ పోస్టర్ తో ఓ డైలాగ్ వ‌దిలాడు మ‌నోజ్‌. ఇప్పుడు టీజ‌ర్‌లో అన్నీ డైలాగులే.  ‘వీడికి నిజంగానే చెయ్యి దురదయ్యా బాబూ.. తట్టుకోలేవ్’ అంటూ హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని ఒకే ఒక్క డైలాగ్‌లో చెప్పేశారు.  ‘కొడితే ఒంట్లో ఉన్న 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయ్ నా కొడకా’ అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్  లో హీరోయిజం ఒల‌క‌బోశాడు. కోట చెప్పే డైలాగ్ కూడా మాస్‌ని అల‌రించేదే. మొత్తానికి  మాస్ కోసం మ‌నోజ్ చేస్తున్న హై ఓల్టేజ్ సినిమా అనే సంకేతాల్ని టీజ‌ర్‌ పంపేసింది. టేకింగ్‌, విజువ‌ల్స్ అన్నీ భారీగానే ఉన్నాయి. అయితే... టీజ‌ర్‌లో నా కొడ‌క‌, చేతి దుర‌ద అనే సౌండింగ్ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి బొత్తిగా న‌చ్చ‌క‌పోవొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్‌.ఆర్‌.. `స‌రైనోడు` టీజ‌ర్‌ని గుర్తు చేస్తోంది. మ‌నోజ్ సుత్తి ప‌ట్టుకొన్న స్టిల్‌.. కూడా స‌రైనోడుకి కాపీ అనిపించ‌క మాన‌దు. ఈ చిన్న చిన్న మైన‌స్‌ల‌ని ప‌క్క‌న పెడితే.. మాస్‌కి న‌చ్చే మ‌రో సినిమా త్వ‌ర‌లో రాబోతోంద‌న్న సంకేతాల్ని గుంటూరోడు పంపేసింది. మ‌రి థియేట‌ర్లో మ‌నోజ్ ఇంకెంత ర‌చ్చ చేస్తాడో చూడాలి.