హేభా పటేల్ తో రాజ్ తరుణ్ పెళ్లి





రాజ్ తరుణ్.. హేభా పటేల్ ల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రోజుల నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిపై ఈ జంట సైలెంట్ గా ఉంటున్నారు తప్ప.. కాదు లేదంటూ ఖండించే  ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే.. ఇప్పుడు హేభా పటేల్ తో రాజ్ తరుణ్ పెళ్లి అంటే రియల్ లైఫ్ కి సంబంధించిన విషయం కాదు. ఇదో సినిమాలో సీన్ మాత్రమే. 

హేభా నటించిన లేటెస్ట్ మూవీ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీలో.. రాజ్ తరుణ్ కూడా ఉంటాడట. చివర్లో ఈ కుర్రాడు సడెన్ ఎంట్రీ ఇచ్చి.. కుమారి మెడలో మూడు ముళ్లు వేసి ఎగరేసుకుపోతాడట. ఈ మూవీలో హేభాకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గా అశ్విన్.. పార్వతీశం.. నోయల్ లు నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ముగ్గురిని కాదని చివరకు రాజ్ తరుణ్ తో సెటిల్ అయిపోతుందట హేభ. స్టోరీలో ఇదే కీలకమైన ట్విస్ట్ అని చెబుతున్నారు. 

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అనిపించుకోవడమే కాదు.. సక్సెస్ ట్రాక్ రికార్డ్ కూడా ఉండడంతో.. స్టోరీతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని ఇలా సెట్ చేశారట. రీసెంట్ గా మజ్ను మూవీలో కూడా రాజ్ తరుణ్ ఇలాంటి గెస్ట్ రోల్ చేసిన సంగతి మీకు గుర్తిందిగా!