టాలీవుడ్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య వున్న రిలేషన్ తెలిసిందే. మూడో తరం కధానాయకులుకూడా ఇప్పుడు మంచి సన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. హీరో నాగ చైతన్య, రానా ఈ ఇద్దరు కలసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే హీరోలుగా కాదు. నిర్మాతలుగా.
చైతన్యకు అన్నపూర్ణ స్టూడియోస్ రానకు రామానాయుడు స్టూడియోస్ వున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాకుండా సొంతగా మరో బ్యానర్ పెట్టి కొత్త జోనర్ సినిమాలు చేయాలనే ప్లాన్ లో వున్నారని భోగట్టా. ఇందులో భాగంగా మొదట ఓ హారర్ కథను నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం. ఒక కొత్త దర్శకుడితో ఒక కొత్త తరహా ఫార్మలా కాన్సెప్ట్ ను రూపొందిస్తున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ అయ్యే ఛాన్స్ వుంది.
ప్రస్తుతం రానా బాహుబలి ఘాజీ చిత్రాలతో బిజీగా వుండగా, నాగ చైతన్య సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.