భారీ తనానికి, భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ శంకర్. కాంటెంపరరీ ఇష్యూస్ మీద సినిమాలు తీస్తూ..సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేయడం ఆయన శైలి. జెంటిల్మన్ నుంచి నేటి రోబో 2.0 వరకు శంకర్ స్టైల్ ఇదే. ఇండియాలోని స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటిది శంకర్‌కి మాత్రం ఒక హీరోతో చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ స్టార్టింగ్‌లోనే జెంటిల్మెన్ సినిమా చిరుతో చేయాలనుకున్నారు శంకర్. కానీ బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు..అయితే అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి సూపర్‌హిట్ కొట్టారు చిరంజీవి.
ఆ తర్వాత చాలా సందర్భాల్లో చిరు-శంకర్ కాంభినేషన్‌పై మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంతో తో రోబో 2.0 సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ బిజినెస్ కోసం ప్లాన్ చేసిన శంకర్. లోకల్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి ఈ క్రియేటివ్ జీనియస్ మాంచి స్కెచ్ వేశాడు. హిందీలో అమీర్‌ఖాన్‌ను గెస్ట్‌రోల్‌లో నటింపచేస్తుండగా తెలుగు విషయానికి వచ్చేసరికి ఎవరితో చేయాలా అన్న డైలమాలో పడ్డాడు శంకర్. మొదట మహేశ్, చిరంజీవి పేర్లు వినిపించినప్పటికీ..రజనీ స్టామినా, హోదాను బట్టి చిరంజీవితోనే కామియో అప్పిరెన్స్ ఇప్పించాలని శంకర్ డిసైడయ్యాడట..దీనికి మెగాస్టార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఫిలింనగర్ టాక్.